నితిన్ చేతికి మరో క్రేజీ చిత్రం.. వర్కౌట్ అయితే వసూళ్ల వర్షమే..
యంగ్ హీరో నితిన్ కి గత ఏడాది కలసి రాలేదు. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు.

యంగ్ హీరో నితిన్ కి గత ఏడాది కలసి రాలేదు. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. నితిన్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.
అయితే నితిన్ అప్పుడప్పుడూ నిర్మాతగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత. నితిన్ గత ఏడాది తాన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ లో కమల్ హాసన్ విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్ బాక్సాఫీస్ మ్యానియాతో నితిన్ కి రెట్టింపు లాభాలు వచ్చాయి.
విక్రమ్ కమల్ హాసన్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. దీనితో నితిన్ పెద్ద మొత్తంలోనే లాభాలని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో పరభాషా చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా కన్నడ చిత్రం కబ్జా. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. చంద్రు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కెజిఎఫ్ తరహాలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అదే స్థాయిలో హైప్ ఉంది.
ఈ చిత్రాన్ని తాము రిలీజ్ చేస్తున్నాం అని నితిన్ ట్విట్టర్ లో ప్రకటించారు. కబ్జా చిత్రాన్ని మా రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్ పై కబ్జా చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు నితిన్ తెలిపారు. విక్రమ్ తరహాలోనే కబ్జా కూడా పెద్ద హిట్ అవుతుందని నితిన్ భావిస్తున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే సూపర్ హిట్ గ్యారెంటీ.