Asianet News TeluguAsianet News Telugu

‘ఇష్క్’ రీ-రిలీజ్ ట్రైలర్.. చూసారా కేక ఉంది

  విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. నిత్యా మీనన్ హీరోయిన్‌గా చేసింది.  2012 ఫిబ్రవరి, 24న  విడుదలైన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 

Nithiin Nithya Menen Ishq Re Release Trailer
Author
First Published Mar 28, 2023, 1:38 PM IST


ఈ మధ్యంలో తెలుగులో ప్ర‌తి వారం కొత్త సినిమాల‌ రిలీజ్ లతో పాటు స్టార్ హీరోల సూప‌ర్ హిట్ సినిమాలు రీ-రిలీజ్ అవుతూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తోన్నాయి. ఇప్పటికే మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ న‌టించిన సినిమాలు రీ-రిలీజ్‌లోనూ చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. కాగా, ఈ రీ-రిలీజ్ ట్రెండ్‌లోకి యంగ్ హీరో నితిన్ సినిమా కూడా చేరుతోంది. నితిన్‌, నిత్యామీన‌న్ జంట‌గా న‌టించిన ‘ఇష్క్’ మూవీ ఈ నెల (మార్చి) 29న రీ-రిలీజ్ కానుంది. నితిన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. కాగా, ఈ రోజు ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 2.24 సెకన్ల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా 2012లో రిలీజైన ఈ సినిమాకు విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వ‌రుస ప్లాఫ్ లతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న నితిన్ ఈ సినిమాతోనే తిరిగి సక్సెస్ బాట ప‌ట్టాడు. నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. అత‌డి సెకండ్ ఇన్నింగ్స్‌కు చ‌క్క‌టి పునాది వేసింది. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గానే కాకుండా రెండు నంది అవార్డుల‌ను కూడా ఇష్క్ సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను బలే ఆక‌ట్టుకుంటాయి. మరి థియేటర్లలో ఇరగతీసిన ఈ రోమ్-కామ్ మూవీ రీ-రిలీజ్ లో ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ప్ర‌స్తుతం  వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ సినిమాకు  ’సైతాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అటు మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న వెంకీ కుడుముల మూవీ కూడా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాకు ప్రారంభోత్సవం చేశారు.  నితిన్ తో ‘భీష్మ’ లాంటి హిట్ సినిమా తీసిన ఈ దర్శకుడు, మళ్ళీ నితిన్,  రష్మిక హీరో, హీరోయిన్లుగా ఈ ప్రాజెక్టు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios