ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు. చాలా కాలం తరువాత హారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
సినిమాకు మంచి టైటిల్ ను వెతకడం పెద్ద సవాల్. ఎందుకంటే టైటిల్ ని బట్టే సినిమాకు జనాలు వెళ్లాలా వద్దా అనేది డిసైడ్ అవుతున్నారు. దాంతో దర్శక,నిర్మాతలు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్నారు. కొందరేమో పాత సినిమాల పేర్లను రిపీట్ చేస్తున్నారు.ఏదో విధంగా టైటిల్ తో సినిమాలకు బజ్ క్రియేట్ చేయటం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. పెద్ద సినిమాలు అయితే టైటిల్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. జనాల్లోకి ఈజిగా వెళ్లే టైటిల్ కావాలి. అలా టెంపర్, పాగల్, ధమాకా వంటి పేర్లు జనాల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్లో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాకు ‘సైతాన్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సమాచారం.
నితిన్ కు ఈ సినిమా హిట్ చాలా అవసరం. లాస్ట్ ఇయిర్ ఆగస్ట్‌లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత నితిన్ జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిసింది. వక్కంతం వంశీ స్టోరీపై రీ వర్క్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.చాలా రోజుల తర్వాత తన 32వ సినిమాలో ఔట్ అండ్ ఔస్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డి, సోదరి నిఖితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన వక్కంతం వంశీ.. 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా మారారు. 2018లో విడుదలైన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు బాగుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. బన్నీ కెరీర్ లో ఇదొక డిజాస్టర్. దీంతో వక్కంతం వంశీ దర్శకుడిగా మరో అవకాశం రాలేదు. దాంతో ఈ సినిమా అతని కెరీర్ ని డిసైడ్ చేయనుంది.
