తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా 'భీష్మ'తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. నితిన్ కు సైతం ఈ సినిమా మంచి ఊపు ని ఇచ్చింది. అంతకు ముందు శ్రీనివాస కళ్యాణంతో డీలా పడ్డ నితిన్ ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చేసారు. దాంతో తనకు ఈ ఉత్సాహాన్ని ఇచ్చిన దర్శకుడు పుట్టిన రోజు కానుకగా..నితిన్ రేంజి రోవర్ కారుని గిప్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు చాలా ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.మీరు ఓ బెస్ట్ ఫిల్మ్ ని బెస్ట్ పర్శన్ తో చేసినప్పుడు బెస్ట్ థింగ్స్ జరుగుతాయి. నాకు బెస్ట్ బర్తడే గిప్ట్ అందించిన నితిన్ అన్న..అంటూ ట్వీట్ చేసారు.
 
అయితే ఇదే సమయంలో చాలా మందికి ఈ దర్శకుడు తొలి చిత్రం ఛలో నాటి ఎక్సపీరియన్స్ ని మీడియా,సోషల్ మీడియా గుర్తు చేసుకుంటోంది. `ఛలో` సినిమా విజయం సాధించడంతో నాగశౌర్య ...ఈ దర్శకుడుకు కారు బహుమతిగా ఇచ్చారు. అయితే ఇద్దరి మధ్యా విభేధాలు వచ్చాక  ఆ కారు గిప్ట్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. దర్శకుడు వెంకీ కుడుములపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో నాగశౌర్య విమర్శలు చేశాడు. వెంకీ కుడుముల ఓ నమ్మకద్రోహి అని, అతను తన స్నేహితుడే కాదని నాగశౌర్య అన్నాడు. అలాగే తన అమ్మ బహుమతిగా ఇచ్చిన కారును వాడకుండా పక్కన పడేశాడని చెప్పాడు.  అయితే  ఆ కారు అమ్మలేదని,తన దగ్గరే ఉందని, తనకు తొలిసారి వచ్చిన గిప్ట్ అని వివరణ ఇచ్చారు.
  
 ఇక ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అయ్యి..తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  ఓపెనింగ్స్ కొంచం స్లో గా మొదలు అయినా మ్యాట్నీ షోల నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ ని చూపెడుతూ దూసుకు పోయింది. ఇది చిత్రం టీమ్ కు,హీరోకు,నిర్మాతకు మంచి ఆనందం కలిగించింది.  'అ ఆ' తరువాత యుఎస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా 'భీష్మ' నిలిచింది.

 పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.  మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చేసారు.