యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. నితిన్ ఈ మూవీపై చాలానే హోప్స్ పెట్టుకుని ఉన్నాడు. నితిన్ చివరగా నటించిన చిత్రాలు ఆశించిన సక్సెస్ అందించలేకపోయాయి. 

దీనితో నితిన్ మాచర్ల నియోజకవర్గం కోసం బాగా కష్టపడుతున్నాడు. తన సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా మాస్ ప్రేక్షకులలో ఈ మూవీపై ఆసక్తి పెంచేలా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ, తెలుగు భామ అంజలి స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజయింది. 'రారా రెడ్డి' అంటూ అంజలి అందాలు ఆరబోయడం మాత్రమే కాదు.. నితిన్ తో కలసి ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము లేపేస్తోంది. థియేటర్స్ లో మాస్ ప్రేక్షకుల సందడి ఈ సాంగ్ కి ఒక రేంజ్ లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటి సాలిడ్ స్టఫ్ ఈ సాంగ్ లో ఉంది. 

రారా రెడ్డి ఐయామ్ రెడీ అంటూ లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన మాస్ బీట్ కేక పెట్టించే విధంగా ఉంది. కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ అందించారు. ఇక అంజలి హాట్ నెస్ ఈ సాంగ్ లో నెక్స్ట్ లెవల్ లో ఉందనే చెప్పాలి. కంప్లీట్ లిరికల్ సాంగ్ ని శనివారం రిలీజ్ చేయనున్నారు. 

ఆగష్టు 12న మాచర్ల నియోజకవర్గం చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా కేథరిన్, కృతి శెట్టి నటిస్తున్నారు. త్వరలో ప్రచార కార్యక్రమాలు మొదలు కానున్నాయి. 

 

YouTube video player