మిలీనియం బిగినింగ్ లో దర్శకుడు తేజా అద్భుతాలు చేశాడు. సినిమాటోగ్రాఫర్ గా పలు చిత్రాలకు పని చేసిన తేజా 2000లో విడుదలైన 'చిత్రం' మూవీతో దర్శకుడిగా మారారు. ఉదయ్ కిరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన 'చిత్రం' అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక 2001లో తేజా రెండవ చిత్రంగా విడుదలైన నువ్వు నేను మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 
మరలా ఉదయ్ కిరణ్ నే హీరోగా తీసుకొని తేజా నువ్వు నేను పేరుతో యూత్ ఫుల్ లవ్ డ్రామా తెరకెక్కించారు. ఇక మూడవ చిత్రంగా నితిన్ ని వెండితెరకు పరిచయం చేస్తూ జయం మూవీ తెరకెక్కించాడు తేజ. జయం కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ గా ఆయన ఖాతాలో చేరింది. దర్శకుడిగా తేజా చేసిన వరుస చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి. కొత్త హీరోలతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ మూడు చిత్రాలు కోట్ల వసూళ్లు రాబట్టి నిర్మాతకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించాయి. 


కాగా జయం మూవీ షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్, నితిన్ లతో తేజా కలిసి దిగిన పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేజా వెండితెరకు పరిచయం చేసిన నితిన్, ఉదయ్ కిరణ్ దర్శకుడు తేజా పక్కన నిల్చొని నవ్వులు చిందించారు. జయం మూవీతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుమన్ శెట్టిని కూడా ఆ ఫొటోలో చూడవచ్చు. ఎంతో భవిష్యత్ ఉంటుందనుకున్న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరినీ కలచివేసింది అంశం.