దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మన సినీ తారలు హ్యాండ్ బ్యాగ్స్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం.. కానీ నీతా అంబానీ అంతకుమించి ఒక బ్యాగ్ కోసం కోట్లు ఖర్చు పెట్టింది.

ఆమె బ్యాగు రేటు ఏకంగా రూ.2.6 కోట్లని సమాచారం. ఇప్పుడు ఈ బ్యాగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్రోకొడైల్ హ్యాండ్ బ్యాగ్ గా పేర్కొంటున్న దీని విలువ అక్షరాలా రూ.2.6 కోట్లని తెలుస్తోంది. 

అయితే అంత ధర ఉండడానికి కారణమేంటంటే.. ఈ బ్యాగ్ లో 240 డైమండ్స్ పొండుపరిచారట. బాలీవుడ్ నటి కరిష్మాకపూర్.. నీతా అంబానీతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఈ బ్యాగ్ సంగతి బయటకొచ్చింది.

దీంతో ఇప్పుడు అందరూ బ్యాగ్ కోసం ఇంటర్నెట్ లో వెతకడం మొదలుపెట్టారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాగ్ ఇదేనని అంటున్నారు. లక్షల కోట్లలో సంపాదన ఉన్న అంబానీ ఫ్యామిలీకి రెండున్నర కోట్లంటే పెద్ద విషయమేమీ కాదులెండి!