పులి సినిమాలో హీరోయిన్‌గా నటించిన నికీషా పటేల్‌  ఫుడ్‌ పాయిజన్ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్న‌ నికీషా  ఇకపై ఎప్పుడూ పానీ పూరీ జోలికి వెళ్ళనని ఒట్టేసుకున్న భామ‌


 పానీ పూరీ కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ అయ్యిందనీ, ఇకపై ఎప్పుడూ పానీ పూరీ జోలికి వెళ్ళనని ఒట్టేసేసుకుంది. పానీ పూరీని బ్యాన్‌ చేసెయ్యాలని కూడా నినదిస్తోంది నికీషా పటేల్‌. ఈ దెబ్బతో తనకు బుద్దొచ్చేసిందని చెప్పుకొచ్చింది. సరదాగా కాదండోయ్‌, సీరియస్‌గానేనట. ఆ మధ్య పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌తో 'అరకు రోడ్‌లో' సినిమాలో నటించిన నికీషా పటేల్‌, 'గుంటూరు టాకీస్‌' సీక్వెల్‌లోనూ ఛాన్స్‌ కొట్టేసింది.

 తమిళంలో ఒకటీ అరా సినిమాలు చేస్తున్న ఈమెకి, కన్నడలో అవకాశాలు బాగానే వున్నాయట. చేతికి సెలైన్‌ ఎక్కిస్తున్న ఫొటోని సోషల్‌ మీడియాలో అయితే షేర్‌ చేసేసిందిగానీ, పానీ పూరీ అంటే అమితంగా ఇష్టపడే నికీషా పటేల్‌.. మళ్ళీ కోలుకున్నాక, అటువైపు చూడకుండా వుంటుందా.? అసలే, తనను తాను 'తిండిబోతు'నని చాలా గర్వంగా చెప్పేసుకుంటుందీమె.