తాను ప్రభుదేవానే కాదు, ఎవరినీ పెళ్లి చేసుకోవడం లేదని ప్రముఖ నటి నికీషా పటేల్ స్పష్టం చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను ఆమె పెళ్లి చేసుకోనుందంటూ వస్తున్న వదంతులను ఆమె ఖండించింది. ఈ విషయమై నికీషా పటేల్ తన పీఆర్వో ద్వారా స్పష్టత నిచ్చారు. వార్తా పత్రికలు ఏవేవో రాస్తున్నాయని, ఈ వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం తనకు ఉందని చెప్పింది. 

ఆ వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, ప్రభుదేవా తనకు మంచి స్నేహితుడు, శ్రేయోభిలాషి మాత్రమేనని, ప్రభుదేవాను ‘సార్’ అని తాను పిలుస్తానని స్పష్టం చేసింది. కాగా ‘కొమరం పులి’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు నికీషా పరిచయమైంది. ‘ఓమ్’, ‘అరకురోడ్డు’, ‘గుంటూరు టాకీస్ 2’ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ నికీషా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘తేరీ మెహర్బానియా 2’ అనే చిత్రంలో నటిస్తోంది.