నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయారు. నిఖిల్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం స్పై. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మీడియం బడ్జెట్ చిత్రాలతో అలరించే యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 2' చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కార్తికేయ 2 ఇండియా మొత్తం రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో నిఖిల్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీ హీరోగా మారిపోయారు. నిఖిల్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం స్పై. గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
స్పై మూవీ జూన్ 29న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో నేడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఊహించినట్లుగానే నిఖిల్ స్పై ట్రైలర్ స్టైలిష్ గా, యాక్షన్ ప్యాక్డ్ గా అదిరిపోయింది. 'చరిత్ర మనకి ఎప్పుడూ నిజం చెప్పదు.. దాస్తుంది.. దానికి సమాధానం మనమే వెతకాలి' అనే ఆసక్తికరమైన డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. నిఖిల్ పవర్ ఫుల్ ఏజెంట్ గా ఎంట్రీ ఇస్తాడు.
తన సొంత అన్నని ఎవరు చంపారో అనే వేటలో నిఖిల్ ఉంటాడు. అలాగే ఏజెంట్ గా కూడా తన పని సీక్రెట్ గా చేస్తుంటాడు. ఇంతలో సుభాష్ చంద్రబోస్ గురించి ఆసక్తికర విషయాలు ట్రైలర్ లో చూపించారు. చివర్లో మంచి హై ఇచ్చే విధంగా ట్రైలర్ లో భల్లాల దేవుడు రానా దగ్గుబాటి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. 'స్వాతంత్రం ఒకరు ఇచ్చేది కాదు.. లాక్కునేది.. ఇది నేను చెప్పింది కాదు నేతాజీ చెప్పింది' రానా పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు. ట్రైలర్ లో గమనిస్తే రానా ఈ చిత్రంలో ఆర్మీ పైలట్ గా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ రానా పాత్ర గురించి పూర్తి వివరాలు సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. లేదా అంతకంటే ముందే చిత్ర యూనిట్ రివీల్ చేయాలి.
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, రానా, ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమటం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ తదితరులు.

