విడుదల తేదీని వాయిదా వేయడానికి నిర్మాత ఏమాత్రం ఇష్టపడడం లేదు. లాస్ట్ మినిట్ లో ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తే అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరు.
'స్పై' మూవీ నిర్మాత - హీరో నిఖిల్ మధ్య మూవీ రిలీజ్ పై సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరికి సినిమా రిలీజ్ వద్దని అంటున్నాడు నిఖిల్. ఎందుకంటే ప్రమోషన్ కు టైం సరిపోదు. కాబట్టి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందనేది నిఖిల్ వాదన. అటు నిర్మాత ఈక్వేషన్స్ మరో విధంగా ఉన్నాయి. అదేంటంటే ఈ సినిమాను ఇంతకుముందు ప్రకటించిన తేదీకి కచ్చితంగా రిలీజ్ చేయాలి. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుంది. ఒకవేళ సినిమా విడుదల కనుక ఇప్పుడు వాయిదా పడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. అందుకే విడుదల తేదీని వాయిదా వేయడానికి నిర్మాత ఏమాత్రం ఇష్టపడడం లేదు. లాస్ట్ మినిట్ లో ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తే అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోరు. ఇలా ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి.
చివరకు ‘స్పై’ మూవీ వాయిదాలాంటిదేమీ లేదని నిర్మాత రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. నిఖిల్ కూడా ఇక చేసేదేమీ లేక సినిమాను పూర్తి చేసి ప్రమోషన్స్‌లో వీలైనంత మేరకు సపోర్ట్ ఇవ్వటానికి రెడీ అయిపోయారు మరి. ఈ నేపధ్యంలో నిర్మాతతో విభేధాలు గురించి నిఖిల్ అసలు ఏం జరిగిందో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చెప్పే ప్రయత్నం చేసారు.
నిఖిల్ మాట్లాడుతూ....నా బాధంతా ఒకటే ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు మినిమమ్ 200, 250 రూపాయల దాకా వెళ్ళిపోయాయి అవుట్ ఫుట్ కూడా ఆ ధరను మ్యాచ్ చేసేలాగా ఉండాలి అని చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం తాను ఈ సినిమా చూసినప్పుడు ఇంకా చాలా వర్క్ బ్యాలెన్స్ ఉందని అందుకే 29వ తేదీ రిలీజ్ వద్దు అని కోరానని అన్నారు. అయితే 200 మంది చేయాల్సిన విఎఫ్ఎక్స్ మీద 2000 మంది పనిచేశారు, దాదాపుగా ఈ ఒక్క సినిమా కోసమే ఐదారు విఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేశాయని అందుకే ఈరోజు విజయవంతంగా సెన్సార్ కూడా పూర్తి చేయగలిగామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అసలు వివాదమే లేదని కేవలం అవుట్ ఫుట్ విషయంలోనే కాస్త భేదాభిప్రాయాలు నిర్మాత, హీరో మధ్య వచ్చాయనే విషయం తేల్చారు. ఈ సినిమాని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేస్తుండగా రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి స్వయంగా రాజశేఖర్ రెడ్డి కథ అందించడం గమనార్హం.
