టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు 'ముద్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు.
అయితే కొన్ని రోజులుగా నిఖిల్ పై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ పై అతడు చేశాడని, వారిని కొట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు నిఖిల్. ''కాలేజ్ లో నా తమ్ముడి విషయంలో నేను ఇన్వాల్వ్ అయిన మాట నిజమే. కానీ నేను స్టూడెంట్స్ ని కొట్టానని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నా తమ్ముడు చదువుకుంటున్న కాలేజ్ లో 16 మంది కలిసి నా తమ్ముడిని ర్యాగింగ్ చేస్తున్నారు.
ప్రతిరోజు వాడిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం నాకు తెలిసి నేను వారిపై పోలీసులకు కంప్లైంట్ చేశాను. వారిపై పోలీసులే చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ వారిపై ఒక్క దెబ్బ కూడా పడలేదు. నేను పోలీస్ కంప్లైంట్ చేశానని కావాలని నన్ను బ్యాడ్ చేయడానికి మీడియాలో నన్ను రౌడీలా పోట్రెయ్ చేస్తున్నారు'' అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్.
