నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా  టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో  రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. అయితే ఆ వాయిదా పడటానికి ఓ సెంటిమెంట్ ని మిక్స్ చేసారు నిఖిల్. వాయిదా పడటం సూపర్ హిట్ అవటానికే అన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా లేటైంది. చాలా కాలం క్రితమే సినిమా ప్రారంభమైంది.

దాంతో ఈ సినిమాను గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 29న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం ఉందని మళ్లీ వాయిదా వేసారు.

ఈ నేపధ్యంలో సినిమాపై క్రేజ్, బజ్ మెల్లిగా తగ్గుతూ వచ్చింది. దానికి తోడు ఈ సినిమాకు ముందగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ జగపతిబాబు హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడింది. అయితే మరక మంచిదే అన్న రీతిలో ఈ విషయాన్ని చాలా కూల్ గా తీసుకున్నారు నిఖిల్ . 

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. మంచి డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మే 1న రిలీజ్ చేస్తున్నాం. నైజాం ఏషియన్ సునీల్ చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్. నా సినిమాలు పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి హిట్ అయ్యాయి. మళ్లీ ఈ చిత్రం అలాగే జరిగింది. లక్కీగా ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. మా చేతిలో మంచి సినిమా రెడీగా ఉంది. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైనా సినిమా బాగా రావడానికి నిర్మాతలు ఠాగూర్ మధు, రాజ్ కుమార్ ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు’’ అన్నారు.