యంగ్ హీరో నిఖిల్ సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన బంధువు కోసం ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తాజాగా ఈ హీరో ఎన్నికల రిజల్ట్స్ పై స్పందించారు. ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయంలో మన నేతలు టెన్షన్ తో ఉన్నారు.

ఆ టెన్షన్ తో పోలిస్తే  తన సినిమా రిలీజ్ టెన్షన్ చాలా చిన్నదని అంటున్నాడు. ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయంపై నిఖిల్ సూటిగా స్పందించనప్పటికీ ఆయన మాటలు ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.

చంద్రబాబు ఎంతో చేశారని, ఆయన అనుభవం ఉందని చెప్పిన నిఖిల్ జగన్ లాంటి యంగ్ లీడర్ కూడా రావాలని, ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తారని.. ఆయనేం చేస్తారో చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. జగన్ ఎప్పుడూ జనాల్లోనే ఉంటారని, ఆయన గొప్ప వ్యక్తి అంటూ పొగిడేశాడు.

అలానే పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన ఏం చేస్తారో కూడా చూడాలనుందని అన్నారు. మరి ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో అని అన్నారు. పవన్ కళ్యాణ్ కి వంద సీట్లు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ నటించిన చాలా సినిమాలు వంద రోజు ఆడాయని అలానే ఆయన స్థాపించిన జనసేన పార్టీకి కూడా వంద సీట్లు రావాలని కోరుకున్నాడు.