తాము ఉన్న కాలం నుంచి భవిష్యత్తులోకో, లేక గతంలోకో ప్రయాణం చేయించే కథలతో సినిమా అనగానే  ‘టైమ్‌ మిషన్‌’ గుర్తు వస్తుంది. అయితే టైమ్ మిషన్ నేపథ్యంలో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలుగులో ‘ఆదిత్య 369’ తప్ప వేరేది గుర్తుకు రాదు. అయితే ఈ సినిమా తర్వాత టైమ్ మిషన్ అనగానే ఆ సినిమాని కాపీ కొట్టారంటారనో మరెందుకో కానీ తెలుగులో సాహసం చేయలేదు. కానీ నిఖిల్ టైమ్ మిషన్ నేపధ్యంలో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండతో టాక్సీవాల్ హిట్ ఇచ్చిన రాహుల్ ఇదే కాన్సెప్టుతో నిఖిల ని ఎప్రోచ్ అయ్యారట. టైమ్ మిషన్ నేపధ్యంలో కొత్త తరహా కథ,కథనంతో సాగుతూ నేరేట్ చేయటంతో వెంటనే నిఖిల్ ఓకే చేసారని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, అతి త్వరలోనే సినిమా పట్టాలు ఎక్కబోతోందని చెప్తున్నారు. ఇదో సైన్స్ ఫిక్షన్ సినిమా అని తెలుస్తోంది. 

నిఖిల్ కూడా ప్రస్తుతం ముద్ర సినిమా చేస్తున్నారు. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  చిత్రం‘ముద్ర’. గన్ను కంటే పెన్ను గొప్పది అనే కాన్సెఫ్ట్‌తో జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందీ చిత్రం. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న సమస్యలను గుర్తించడంలో మీడియా ఎటువంటి పాత్ర వహిస్తుంది. 

జర్నలిస్ట్‌గా నిఖిల్ తన కర్తవ్యంని ఎలా నిర్వర్తించాడు అనేదే ఈ చిత్ర మెయిన్ కథాంశంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. మూవీ డైనమిక్స్ మరియు ఔరా సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతుంది.