Asianet News TeluguAsianet News Telugu

USA లో తెలుగు సినిమా సత్తా మరోసారి నిరూపించిన కార్తికేయా-2, ఏమాత్రం తగ్గని క్రేజ్...

రిలీజ్ అయ్యి  నెల రోజులు కావస్తున్నా.. ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు కార్తికేయ-2 సినిమాకు. మన దగ్గర బాగా క్రేజ్ ఉంది అంటే అనుకోవచ్చు.. కాని ఫారెన్ లో కూడా కార్తికేయ2కి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతుంది సినిమా. 

Nikhil Karthikeya-2 New Records in USA
Author
First Published Sep 5, 2022, 12:59 PM IST

రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా కార్తికేయ‌-2 క్రేజ్ ఇంకా తగ్గడంలేదు. ఇంకా చాలా చోట్ల ఈ సినిమా హ‌వానే న‌డుస్తుంది.  నిఖిల్ కెరీర్‌లోనే ఈ సినిమా  బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్ట‌ర్ గా నిలిచింది. నిఖిల్ సిద్థార్థ్  , అనుపమా పరమేశ్వనర్ హీరో హీరోయిన్లు గా.. చందూ మొండేటి డైరెక్షన్ లో.. అడ్వేంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన  కార్తికేయా-2 మూవీ..  రికార్డ్స్ మీద రికార్స్ సాధిస్తూ.. దూసుకుపోతోంది. 

ఒక్క  తెలుగులో మాత్రమే కాకుండా  రిలీజ్ అయిన ప్రతీ భాషలో కార్తికేయా 2 సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్నిచోట్ల ఈ సినిమా  డ‌బుల్ బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో బాహుబ‌లి, పుష్ప సినిమాల తరువాత మూడో స్థానంలో కార్తికేయ2 నిలవడం విశేషం. ఇక  ఆ స్థాయిలో హిందీ ప్రేక్ష‌కుల‌ను కార్తికేయ2  ఆక‌ట్టుకుంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ను.. 50కోట్ల‌కు పైగా షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. 

 

 

ఇక ఈ హాడావిడి కొనసాగుతుండగానే.. కార్తికేయ-2  సినిమా మరో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసింది. మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను 2సాధించింది.  రీసెంట్ లెక్కల ప్రకారం అక్కడ కార్తికేయ-2 యూఎస్ఏలో 1.5 మిలియ‌న్ డాల‌ర్ల కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా నాలుగో వారంలో 80 పైగా లోకేష‌న్ల‌లో ర‌న్ అవుతున్న‌మొద‌టి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.  ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్స్ ఎంతో మంది ఈ సినిమాను అద్భతమంటూ మెచ్చుకున్నారు. ఈసినిమా వల్ల నిఖిల్ కు బాలీవుడ్ లో రెండు భారీ ఆఫర్లు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈసినిమా.. చిన్న సినిమాల్లో చూసుకుంటే.. తెలుగులో గీతా గోవిందం త‌ర్వాత అత్య‌ధిక ప్రాఫిట్స్‌ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఈ జోష్ తో వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు నిఖిల్. ఇప్పటికే ఆయన ఖాతాలో మూడు సినిమాల వరకూ ఉన్నాయి. వాటిని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు యంగ్ స్టార్ హీరో. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios