కార్తికేయ సినిమాతో కెరీర్ ను మంచి సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చుకున్న యువ హీరో నిఖిల్ మళ్ళీ ట్రాక్ తప్పాడు. తెరకెక్కిన సినిమాలు కూడా రిలీజ్ కాలేని పరిస్థితి ఏర్పడింది అంటే నిఖిల్ మార్కెట్ కు ఎంతగా ఎఫెక్ట్ పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడికి పోతావు చిన్నవాడా - కేశవ సినిమాలతో పాజిటివ్ టాక్ అందుకున్న నిఖిల్ కిర్రాక్ పార్టీతో ఒక్కసారిగా డౌన్ అయ్యాడు. 

ఇక ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని సెంటిమెంట్ తో కార్తికేయ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక సినిమాలో హీరోయిన్ గా శృతి శర్మను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో నటించిన శృతి తన నటనతో ప్రశంసలు అందుకుంది. 

ఇక ఇప్పుడు కార్తికేయ 2లో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వెలువడనుంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసి ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేలా దర్శకుడు చందుమొండేటి ప్లాన్ చేసుకుంటున్నాడు.