శుక్రవారం రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి ఆ చిత్రంతో కార్తికేయ కి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ సీతా రామం, బింబిసార వంటి చిత్రాలు ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి. కాబట్టి వాటితో కార్తికేయ పోటీ పడాల్సిందే. మంచి హిట్ టాక్ వచ్చింది కాబట్టి కార్తికేయ కు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ల పై టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించారు. హీరో ఓ పనిపై ద్వారకా నగరం వెళ్లటం అక్కడ చోటు చేసుకునే ఊహించని పరిణామాలు, అక్కడ జరిగే ప్రమాదాలు వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. కార్తికేయ చిత్రంలోలానే ఈ మూవీలో కూడా ఎన్నో ట్విస్ట్ లు ఉండబోతున్నాయి అని టీజర్, ట్రైలర్ వంటివి స్పష్టంచేశాయి. దీంతో సినిమా పై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. అందువల్ల ఈ సినిమాకు ఓపినింగ్స్ బాగున్నాయి. బిజినెస్ కూడా బాగా జరిగింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆల్ ఇండియా నెట్ (అన్ని లాంగ్వేజ్ లు కలిపి) 7.00 కోట్లు దాకా వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఏపి, తెలంగాణా రాష్ట్రాల షేర్ 4.50 కోట్లు. అయితే ఇవే కరెక్ట్ ఫిగర్స్ కాదు. అంచనాలు మాత్రమే అని గమనిచాలి. కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం ఉండాలి. కానీ శుక్రవారం మిస్సైంది. అయితే ఆగస్ట్ 15 శెలవు కలిసి వస్తుంది.
ఇక బిజినెస్ వివరాలను గమనిస్తే:
నైజాం 4 cr
సీడెడ్ 2 cr
ఉత్తరాంధ్ర 2 cr
ఈస్ట్ 0.75 cr
వెస్ట్ 0.65 cr
గుంటూరు 1.0 cr
కృష్ణా 1.0 cr
నెల్లూరు 0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.75 cr
ఓవర్సీస్ 1.50 cr
మిగిలిన వెర్షన్లు 3 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 17.25 cr