రూ.5 కోట్ల ఆఫర్ ని అందుకునే దర్శకుడెవరు..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 25, Aug 2018, 1:38 PM IST
nikhil gowda special offer to tollywood directors
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ 'జాగ్వార్'  చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ సినిమా సమయంలో ప్రమోషన్స్ కోసం భారీ ఖర్చు చేశారు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ 'జాగ్వార్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ సినిమా సమయంలో ప్రమోషన్స్ కోసం భారీ ఖర్చు చేశారు నిఖిల్ గౌడ ఫ్యామిలీ. కోటి రూపాయలిచ్చి తమన్నాతో ఐటెం సాంగ్. ఇంతా చేసినా సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు ఎర వేస్తున్నాడు నిఖిల్.

కర్ణాటకలో అతడికున్న ఇన్ఫ్లుయెన్స్ తో పెద్ద దర్శకులతో సినిమాలు చేయొచ్చు కానీ నిఖిల్ దృష్టి మొత్తం టాలీవుడ్ మీదే ఉంది. ఇక్కడ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనేది అతడి ప్రయత్నం. ఈ క్రమంలో తనతో సినిమా చేసే టాలీవుడ్ దర్శకుడికి రూ.5 కోట్లు చెక్ ఇస్తానంటూ ప్రకటించాడు నిఖిల్. తెలుగులో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఇంత చెబుతున్నాడు.

మరి నిఖిల్ ఆఫర్ ని అందుకునే ఆ దర్శకుడు ఎవరై ఉంటారనే విషయంలో చర్చ మొదలైంది. అతడు ఆశించినట్లుగా టాలీవుడ్ అగ్ర దర్శకులతో సినిమా చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే రాజమౌళి, బోయపాటి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లంతా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వారి కోసం ఇక్కడి స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారు 5 కోట్ల వలకి చిక్కే అవకాశం లేదు. మరి ఏ డైరెక్టర్ నిఖిల్ తో పని చేస్తాడో చూడాలి!

loader