పవన్ హీరోయిన్ ప్రభుదేవాతో పెళ్ళికి రెడీ!

First Published 10, May 2018, 11:16 AM IST
nikesha patel ready to marry prabhudeva
Highlights

పవన్ కళ్యాణ్ నటించిన 'పులి' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది నికీషా పటేల్

పవన్ కళ్యాణ్ నటించిన 'పులి' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది నికీషా పటేల్. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో అమ్మడుకి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకు వెళ్ళినఈ భామ అక్కడ ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ అవ్వాలని చాలా కష్టపడుతోంది. అలానే కన్నడ, హిందీ భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని చెబుతోందీ బ్యూటీ. తాజాగా తమిళ 'పాండిముని' అనే సినిమాలో నటించే అవకాసం సంపాదించుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె కాస్టింగ్ కౌచ్, పెళ్లి వంటి విషయాలపై స్పందించింది. 

కాస్టింగ్ కౌచ్ పై.. 
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని నేను గతంలోనే వెల్లడించాను. అలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉందనేది నిజం. కానీ ఒక్క సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అన్ని రంగాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీ కావడంతో ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. 

ఇష్టమైన హీరో..
ఇండస్ట్రీలో చాలా మంది హీరోల నటన అంటే నాకు ఇష్టం. ఒక్కరి గురించి చెప్పాలంటే ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించడం కాదు.. ఆయనతో పెళ్ళికి కూడా నేను రెడీ.. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ప్రభుదేవాకు ఇప్పటికే పెళ్లైంది. భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నాడు. నటి నయనతారను పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కుదరలేదు. మరి ఆయన ఆలోచనల్లో మరో పెళ్లి ఉందో లేదో..!

loader