ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్న నిహారిక.. కొత్త జంట వరుణ్ లావణ్య సమక్షంలో ఓపెనింగ్.. డిటెయిల్స్
మెగా డాటర్ నిహారిక ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు చేసింది. కానీ ఇప్పుడు బిగ్ స్టెప్ తీసుకుంది. ఆమె సినిమా ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టింది. కొత్త జంట వరుణ్‌లవ్ సమక్షంలో ఓపెనింగ్ చేయడం విశేషం.

మెగాడాటర్ నిహారిక హీరోయిన్‌గా మూడు సినిమాలు చేసింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. హీరోయిన్‌గా ప్రయోగం చేసింది. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకుంది. పెళ్లి చేసుకుంది. అదే సమయంలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసింది. నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్‌లను నిర్మిస్తుంది. `ముద్దపప్పు అవకాయ్`, `నాన్న కూచి`, `మ్యాడ్ హౌజ్`, `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `హలో వరల్డ్`, `డెడ్ పిక్సల్స్` వంటి వెబ్‌సిరీస్‌లను తీసి సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు మొదటిసారి బిగ్ ప్రొడక్షన్స్ లోకి అడుగుపెడుతుంది. సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. తన మొదటి సినిమాని ప్రారంభించింది. అంతేకాదు తన ప్రొడక్షన్‌ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీగా మార్చి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై తాజాగా కొత్త సినిమాని స్టార్ట్ చేసింది. నిహారిక సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీ శుక్రవారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గెస్ట్ లుగా ఈ మూవీ ప్రారంభోత్సవం జరగడం విశేషం.
ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, `మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలి సారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యాదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి టీమ్, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం` అని తెలిపారు.
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ , `ఇప్పటి వరకు పింక్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ బేస్డ్ కంటెంటట్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. కొత్తవాళ్లతో ఈ బ్యానర్ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది` అని చెప్పారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి మాట్లాడుతూ, `ఈ సినిమాతో నేను, నా శ్రీమతి జయ నిర్మాతలుగా పరిచయం అవుతున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌తో ముందుకు రాబోతున్నాం` అని అన్నారు.
ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటిస్తున్నారు. సాంకతిక వర్గం - సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాస్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).