టాలీవుడ్ మెగా డాటర్ కొణిదెల నిహారిక తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అలా సూర్యకాంతం టీజర్ తో అమ్మడు అందరి దృష్టిలో పడగానే రూమర్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు నిహారిక ఆ రూమర్స్ కి చెక్ పెడుతూనే ఉంది. 

రీసెంట్ గా ప్రభాస్ - విజయ్ దేవరకొండ వంటి హీరోలతో కూడా పెళ్లి అంటూ రూమర్స్ రావడంతో సూర్యకాంతం ప్రమోషన్స్ లో నిహారిక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు ప్రభాస్ ని ఇంతవరకు తాను కలవలేదని విజయ్ దేవరకొండను కూడా సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూడటమే అని సమాధానం ఇచ్చింది. 

నాని vs విజయ్ దేవరకొండ: బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

ఇక రూమర్స్ ఎన్ని వచ్చినా తాను పెద్దగా పట్టించుకోను అంటూ.. అర్ధం లేని రూమర్స్ ఎన్నో వస్తాయ్.. ఎందుకంటే నేను సెలబ్రెటీని కాబట్టి. నా మీద రూమర్స్ రాస్తే వారికి వ్యూవ్స్ వస్తాయని నిహారిక ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్ గా విడుదలైన నిహారిక సూర్యకాంతం సినిమాకు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక నెక్స్ట్ సినిమాను కూడా ఈ మెగా డాటర్ త్వరలోనే స్టార్ట్ చేయనుంది.