మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చాలానే చేసింది. ఒక మనసు - హ్యాపీ వెడ్డింగ్ - సూర్యకాంతం సినిమాలతో కొత్తగా ట్రై చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. అయితే పలు వెబ్ సిరీస్ లతో మాత్రం మెగా డాటర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

అయితే గత కొంత కాలంగా నిహారికపై ఒక బలమైన రూమర్ వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారని ఇక నుంచి నటనకు ఎండ్ కార్డ్ పెట్టేసి వెబ్ సిరీస్ ల నిర్మాణంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఆ రూమర్స్ ఎన్ని సార్లు వచ్చినా నిహారిక పెద్దగా స్పందించలేదు. ఇక ఇప్పుడు సుకుమార్ తన నెక్స్ట్ సినిమా కోసం ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ నెక్స్ట్ సుకుమార్ తో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నిహారికే అయితే బెస్ట్ అని బన్నీ సజెస్ట్ చేయడంతో సుకుమార్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.