రో మూడు రోజులలో నిహారిక పెళ్లి పీటలు ఎక్కనుంది. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరుకానున్నారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే మెగా హీరోలు అల్లు అర్జున్, చరణ్, ధరమ్ తేజ్ నిహారిక పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబందించిన కార్యక్రమాలన్నీ పూర్తి అయినట్లు సమాచారం. 

మూడు రోజుల క్రితం పెళ్లికూతురు నిహారిక, పెళ్లి కొడుకు చైత్యన్యలు మెగా కుటుంబంలోని యూత్ కి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మిత మరియు మెగా హీరోలు సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్, శిరీష్, కళ్యాణ్ దేవ్ పాల్గొన్నారు. కాగా నేడు సోషల్ మీడియాలో నిహారిక అరుదైన ఫోటో పంచుకున్నారు. నిహారిక తల్లి పద్మజ నిశితార్ధ వేడుకలో కట్టుకున్న అప్పటి చీరలో నిహారిక దర్శనం ఇచ్చారు. నీలి రంగు, బంగారు అంచు కలిగిన అప్పటి చీరలో నిహారిక ముస్తాబై, ఆ విషయాన్ని సోషల్ మేడియా ద్వారా తెలియజేశారు. 

అప్పుడు తన తల్లి పద్మజ నిశ్చితార్ధ వేడుకలో ధరించిన చీరలో ముస్తాబయ్యారు నిహారిక. ఇక మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా మారిన ఏకైన అమ్మాయి నిహారిక కావడం విశేషం. నిహారిక హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించారు నిహారిక. ఆగస్టు నెలలో ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక నిశ్చితార్ధం జరిగింది. మరో మూడు రోజులలో వీరు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.