మెగా హీరోలైన వరుణ్ తేజ్, చరణ్ లకు సుస్మిత, శ్రీజ, నిహారిక రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. చెల్లెళ్ళకు, అక్కయ్యలకు మెగా హీరోలు ఖరీదైన బహుమతులు అందించినట్లు సమాచారం. అయితే రాఖీ పండుగ నాడు నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. 


ఆగస్టు 22న మెగా ఫ్యామిలీలో రెండు పండుగలు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన 66వ బర్త్ డే జరుపుకోగా, అదే రోజు రాఖి పూర్ణిమ కావడం విశేషం. రాఖి పండగను పురస్కరించుకొని మెగా ఫ్యామిలీలో ఘనంగా వేడుకలు జరిగాయి. చిరంజీవికి ఇద్దరు సిస్టర్స్ రాఖీలు కట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


ఇక మెగా హీరోలైన వరుణ్ తేజ్, చరణ్ లకు సుస్మిత, శ్రీజ, నిహారిక రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. చెల్లెళ్ళకు, అక్కయ్యలకు మెగా హీరోలు ఖరీదైన బహుమతులు అందించినట్లు సమాచారం. అయితే రాఖీ పండుగ నాడు నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది.


'కొంచెం ఆలస్యం అయింది.. అయినా పర్లేదు హ్యాపీ రాఖీ బేబీ బాయ్. ఇతను ఎవరో గుర్తు పట్టండి..' అంటూ నిహారిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఓ ఆజానుబాహుడైన టీనేజర్ అటు తిరిగి ఉండగా, నిహారిక అతన్ని హగ్ చేసుకుంది. నిహారిక వదిలిన ఆ ఫజిల్ చాలా సులువైనది అని చెప్పాలి. ఎందుకంటే నిహారిక షేర్ చేసిన ఆ ఫొటోలో ఉన్న కుర్రాడు ఎవరో కాదు, పవన్ కుమారుడు అకీరా నందన్. 


బాబాయ్ పవన్ కుమారుడు అకీరాకు రాఖీ కట్టిన నిహారిక, ఆ సమయంలో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పంచుకోవడం జరిగింది. కాగా మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు వరుణ్ అత్యంత పొడగరి కాగా, టీనేజ్ వయసుకే అకీరా అతన్ని మించేశాడు. ఆరున్నర అడుగులకు పైగా హైట్ ఎదిగిన అకీరా, ఆ విషయంలో అందరినీ మించేశాడు. 

View post on Instagram