మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబందించిన ఓక వార్త ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో మెగా డాటర్ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుందని సమాచారం. 

సైరా సినిమాలో ఒక పేదింటి పిల్లగా  నిహారిక రెండు సార్లు కనిపించనుందని పాత్ర నిడివి తక్కువే అయినా మెగా అభిమానుల మనసును తాకే విధంగా నిహారిక పాత్ర ఉంటుందట. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ చిరంజీవితో నిహారిక ఒక బడా ప్రాజెక్ట్ లో నటిస్తోందదనే చెప్పాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యం దాడి చేసే సమయంలో నిహారిక కాపాడే ప్రయత్నం చేస్తుందని సమాచారం. ఆయనకు కీలక సమయంలో ఆశ్రయం కల్పించి తన దేశ భక్తిని చాటుకుంటుందట. 

ఆ సీన్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఎమోషనల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఒక మంచి నటిగా గుర్తింపు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోన్న నిహారికకు ఆ పాత్ర తప్పకుండా ఉపయోగపడుతుందని టాక్. కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తోన్న సైరా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.