మెగా ఫ్యామిలీ నటవారసురాలయిన కొణిదెల నీహారిక 'ఒక్క మనసు'తో ఎవరి మనస్సునీ  గెలవ లేకపోయింది. ఆ తర్వాత  అమ్మడు నటించిన తెలుగు సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ కూడా  అదే దారిలో వెళ్లిపోయింది. ఓ పక్క సినిమాల కోసం వైవిధ్యమయిన కథల్ని ఎంపిక చేసుకుంటూనే మరో పక్క వెబ్‌సిరీస్ లోనూ తన హవా కొనసాగించింది. అదీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ లోగా నీహారిక తెలుగులో 'సూర్యకాంతం' టైటిల్ తో మరో సినిమా చేసింది.

'ముద్దపప్పు ఆవకాయ్' వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రత్యేకంగా నీహారిక సినిమాని నిలబెడుతుందనే నమ్మకాలు అయితే పోయాయి. దాంతో ఆమెకు ఖచ్చితంగా ఇప్పుడు బ్రేక్ ఇవ్వాల్సిన డైరక్టర్ కావాల్సి వచ్చారు. దాంతో మెగా క్యాంప్ కు ఇష్టుడైన డైరక్టర్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ రంగంలోకి దిగినట్లు సమాచారం. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినపడుతున్న సమాచారం మేరకు ...సుకుమార్ తనే సొంతగా ఓ కథ, స్క్రీన్ ప్లే రాసి, మెగా ప్రిన్సెస్ నీహారిక కొణెదల తో సినిమా నిర్మించనున్నారు. ఆ సినిమాని తన అశోశియేట్ ఒకరికి డైరక్షన్ చేయమని అప్పచెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిచమని మెగా క్యాంప్ కోరిందట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన వస్తుంది. 

ప్రస్తుతం సుకుమార్ తను డైరక్ట్ చేయబోయే అల్లు అర్జున్ స్క్రిప్టుని చెక్కే పనిలో ఉన్నారట. ఎలాగూ త్రివిక్రమ్ తో సినిమా పూర్తి చేసుకుని అల్లు అర్జున్ వచ్చేసరికి లేటు అవుతుంది.ఈ గ్యాప్ లో స్క్రిప్టుకు మెరుగులు దిద్దుతున్నాడని అంటున్నారు.