పెళ్లి తర్వాత బోల్డ్ కామెంట్లతో, బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది నిహారిక. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో ఉన్న ఇంటెన్స్ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ తమ మధ్య ఉన్న ఘాటు రొమాన్స్‌ ని తెలియజేస్తుంది. తాజాగా షాక్‌ ఇచ్చింది. తనకు గాయమైనట్టు చూపించింది. కాలుకి గాయమైనట్టు ఉన్న ఫోటోని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది నిహారిక. ప్రస్తుతం ఆమె ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఆ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో గాయమైంది. 

ఇందులో నిహారిక స్పందిస్తూ, `భార్యని భర్త బుజ్జగిస్తున్న కార్యక్రమంలో నేటి ఎపిసోడ్‌ ఏంటంటే.. `కాటన్‌ క్యాండీ` అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇందులో నిహారిక చేతిలో ఓ బాక్స్ ఉంది. అంది కాటన్‌ క్యాండీ తెలుస్తోంది. అయితే తన కాలికి గాయమైన విషయాన్ని మాత్రం నిహారిక చెప్పలేదు. నిజమైన గాయమేనా? లేక కావాలని చేసిందా? అన్నది సస్పెన్స్  నెలకొంది.  ప్రస్తుతం నిహారిక  రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా  రూపొందుతున్న ఓ  వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో మరో కీలక పాత్రలో యాంకర్‌ అనసూయ నటిస్తోంది.