కొణిదెల నిహారిక 'ఒక మనసు' చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ మెగాడాటర్'ఒరు న‌ల్ల నాల్ ప‌త్తు సొల్ రే' అనే చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. జనవరి చివరి వారంలో విడుదలైన ఈచిత్రం అక్కడ మంచి విజయం అందుకుంది. ఈ సందర్భంగా నిహారిక ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

తమిళంలో విడుదలైన నా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. హైదరాబాద్ లో పెదనాన్న సినిమా ఫస్ట్ డే క్రౌడ్ ఎంత ఎక్జైటింగ్‌గా ఉంటుందో అలాంటి ఎగ్జైట్మెంట్ అక్కడ చూశాను అని నిహారిక తెలిపారు తెలిపారు.

ఈ మూవీలో బాబాయ్ స్టైల్ కొంచెం ట్రై చేశాను. నిజానికి అది పవర్ స్టార్ స్టైల్ కాదు. కాటమరాయుడు సినిమాలో ఆయన మీసం తిప్పినట్లు ఏదో ట్రై చేశాను. నాకు మీసం లేకున్నా ఆయనలా ట్రై చేశాను.... అని నిహారిక తెలిపారు.

మా ఫ్యామిలీలో కొందరికి సెకండ్ మూవీ సెంటిమెంట్ ఉన్న మాట నిజమే. అన్నయ్య వరుణ్ తేజ్ సెకండ్ మూవీ హిట్. అదే విధంగా రామ్ చరణ్ అన్నయ్య సెకండ్ మూవీ ‘మగధీర' కూడా చాలా పెద్ద హిట్. తెలుగులో నా సెకండ్ మూవీ విడుదల కాలేదు. కెరీర్లో చూసుకుంటే తమిళ మూవీ నా రెండోది. ఇది మంచి హిట్టయింది. అలా చూసుకుంటే నాకు కూడా వారి మాదిరిగానే సెకండ్ మూవీ కలిసొచ్చిందని చెప్పొచ్చు... అని నిహారిక వ్యాఖ్యానిచారు.

మీ మీద ఈ మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. మీ తొలి సినిమా కోస్టార్ నాగ శౌర్యతో మీకు లింక్ పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేశారు, వీటిని మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ... ‘ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి రూమర్స్ వస్తాయని తెలుసు, అన్నిండి సిద్ధపడే వచ్చాను' అని నిహారిక తెలిపారు.

నాగ శౌర్యతో మాత్రమే కాదు, చండాలంగా మా కజిన్ తో కూడా లింక్ పెట్టి రూమర్స్ స్ప్రెడ్ చేశారు. ఇది చాలా స్టుప్పిడ్... అంటూ తన మనసులోని ఆసహనాన్ని వెల్లగక్కారు నిహారిక.

మీడియాలో వారు సర్వైవ్ కావడానికి ఇలాంటివి రాస్తుంటారు. వాళ్లు అలా రాయడం వల్ల నా లైఫ్ లో ఎలాంటి మార్పు జరుగలేదు. నాకు వచ్చిన స్క్రిప్టులు పోలేదు, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని నిహారిక తెలిపారు.

మీడియాకు చెప్పేది ఒకటే. ఎవరూ దేన్ని ఎక్కువ రోజులు పట్టించుకోరు. అందుకే నేను లైట్ తీసుకుంటాను. ఈ రోజు హాట్ న్యూస్ రేపు ఓల్డ్ న్యూస్ అవుతుంది. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వడం లేదు అని నిహారిక తెలిపారు.

‘హ్యాపీ వెడ్డింగ్' అనేది తెలుగులో నా రెండో మూవీ. లక్ష్మణ్ అనే కొత్త డైరెక్టర్ చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి ఎండింగులో లేదా మార్చి ఈ సినిమా విడుదలవుతుంది... అని నిహారిక తెలిపారు.

"కథలు ఎంచుకునే ముందు నాకు సినిమాలో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది చూస్తాను. ఎలాంటి క్యారెక్టర్... నెగెటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరా? పాజిటివ్ షేడ్ ఉన్నదా? చిన్న పిల్ల క్యారెక్టరా? మెచ్యూర్డ్ క్యారెక్టరా? అనేది చూడను. సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేదే చూస్తాను. కథ విన్న తర్వాత నాతో సినిమా ఎంత ట్రావెల్ అయిందనే విషయాన్నే చూస్తాను. నాకు నచ్చితే చేస్తాను." నిహారిక తెలిపారు.

ఉమెన్‍‌గా నా తొలి సినిమాలో నా క్యారెక్టర్ చాలా ఇష్టపడ్డాను. అది ఎక్స్‌పర్మెంట్ అని తెలిసి చేశాను. ఎక్స్‌పర్మెంట్స్ అన్ని సార్లు హిట్టవ్వవు. నేను జెన్యూన్‌గా కామెడీ ఇష్టపడతాను. కామెడీ చేయడం ఇష్టం. నాలో నేను కూడా ఓ చిన్న కమెడియన్‌ను చూసుకుంటాను. సినిమాకు కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్.... అని నిహారిక తెలిపారు.

ఈ మధ్య కాలంలో కమెడియన్ల కంటే హీరోలే ఎక్కువ కామెడీ చేస్తున్నారు. వారి క్యారెక్టరైజేషనే అలా రాస్తున్నారు. కమెడియన్లు అంటే నాకు బ్రహ్మానందం గారే గుర్తొస్తున్నారు. గత ఐదారు సంవత్సరాల్లో చాలా మంది గ్రేట్ కమెడియన్లు చనిపోయారు. ఇది ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్. ప్రత్యేకంగా కమెడియన్ ఇష్టం అని కాకుండా కంటెంటును ఇష్టపడతాను అని నిహారిక తెలిపారు.