Asianet News TeluguAsianet News Telugu

నిహారికా కొణిదెల ఉగాది స్పెషల్‌.. ఆమె ఫస్ట్ సినిమాకి వెరైటీ టైటిల్‌..

మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టి వెబ్‌ సిరీస్‌లు నిర్మించి సక్సెస్‌ అందుకుంది. ఇప్పుడు సినిమాల్లోకి అడుగుపెడుతుంది. ఆ మూవీ అప్ డేట్ ఇచ్చింది నిహారిక. 
 

niharika konidela gave ugadi treat she revealed her first movie title arj
Author
First Published Apr 9, 2024, 3:30 PM IST

మెగా డాటర్‌ నిహారికా కొణిదెల ఒకప్పుడు హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ విజయాలు అందుకోలేకపోయింది. నటిగా సక్సెస్‌ కాలేకపోయింది. ఆ తర్వాత పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పేరుతో బ్యానర్‌ స్టార్గ్ చేసి నిర్మాతగా మారింది. వెబ్‌ సిరీస్‌ చేస్తూ వచ్చింది. ప్రొడ్యూసర్‌గా ఆమె సక్సెస్‌ అయ్యింది. పెళ్లి చేసుకున్నాక కొంత గ్యాప్‌ ఇచ్చిన నిహారిక ఇప్పుడు ప్రొడక్షన్‌ జోరు పెంచింది. అంతేకాదు సినిమాల్లోకి అడుగుపెట్టింది. తన బ్యానర్‌లో సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేసింది. 

niharika konidela gave ugadi treat she revealed her first movie title arj

నిహారిక ఆ మధ్య తన బ్యానర్‌లో సినిమాని స్టార్ట్ చేసింది. గ్రాండ్‌గా ఓపెనింగ్‌ జరిగింది. కొత్త కుర్రాళ్లతో ఈ మూవీని తెరకెక్కిస్తుండటం విశేషం. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీని `నిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ పతాకాలపై నిర్మిస్తున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ మూవీ టైటిల్‌ని ప్రకటించారు. సినిమాకి `కమిటీ కుర్రోళ్లు` అనే వెరైటీ టైటిల్‌ని ప్రకటించడం విశేషం. సాయిధరమ్‌ తేజ్‌ చేతుల మీదుగా ఈ మోషన్‌  పోస్టర్ ని రిలీజ్‌ చేశారు. గ్రామీణ నేపథ్యంలో అది సాగుతూ ఆకట్టుకుంది. 

నిర్మాత నిహారిక కొణిదెల తన సినిమా విశేషాలను పంచుకుంది. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి సినిమా కమిటీ కుర్రోళ్లు. ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్  విడుదల చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌కి థాంక్స్. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే` అని తెలిపారు. `ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. షూటింగ్ పూర్తయ్యింది` అని దర్శకుడు యదు వంశీ తెలిపారు. 
 

నటీనటులుః
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, టీన శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు

 

సాంకతిక వర్గం : 

సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్,
 ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ - విజయ్,
నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios