మూడుముళ్లు పడిన మూడేళ్లలోపే మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు తీసుకుంది. చైతన్య జొన్నలగడ్డతో విడిపోతున్నట్టు తాజాగా తానే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.  

మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్తతో విడిపోతున్నట్టు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్తలు నిజమేనని నేటితో తెలిపోయింది. నిహారిక - చైతన్య ఇద్దరూ విడిపోవడటం వాస్తవమేనని స్పష్టమైంది. ఇక తాజాగా నిహారిక కూడా తన డివోర్స్ సోషల్ మీడియా వేదికన స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేశారు. తన వెర్షన్ ను రాసుకొచ్చారు.

నిహారిక రిలీజ్ చేసిన నోట్ ప్రకారం.. చైతన్య, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. ఈ సున్నిత సమయంలో తమను ఇబ్బంది పెట్టొద్దంటూ కోరారు. అలాగే తను పిల్లర్ లా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కు థ్యాంక్స్ చెప్పారు. ఇకపై తాము ప్రారంభించబోయే కొత్త జీవితాలకు ప్రైవసీ కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గౌరవించాలని కోరారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

నిహారిక, చైతన్యల వివాహం 2020 డిసెంబర్ 9న గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు చైతన్య కుటుంబీకులు, పలువురు ప్రముఖులు అథితులుగా రాజస్థాన్ లోని జైపూర్ లో వీరి విహహం అంగరంగ వైభంగా జరిగింది. పెళ్లైన కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య మనస్పార్థాలు మొదలైనట్టు పుకార్లు వచ్చాయి. ఆ కొద్దిరోజులకు చైతన్య తన ఇన్ స్టా నుంచి నిహారిక ఫొటోలను తొలగించారు. దీంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేరింది. ఈరోజు అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. 

వీరిద్దరిని కలిపేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా కుదరలేదు. నిహారిక ఏమాత్రం తగ్గకుండా స్వయంగా డివోర్స్ కు దరఖాస్తు చేయడంతో వీరి వివాహ బంధానికి తెరపడింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఇక రీసెంట్ గానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. త్వరలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిహారిక డివోర్స్ వార్త కాస్తా ఇబ్బందిగా మారిందనే చెప్పాలి.