టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు తారలు బయటకొచ్చి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి అయితే ఈ విషయంపై పోరాటానికి దిగింది. కొత్తగా ఇండస్ట్రీకు వచ్చే అమ్మాయిలు దర్శక నిర్మాతలు, హీరోలు, ఆఖరికి మేకప్ మ్యాన్ తో సహా అందరినీ సాటిస్ఫై చేయాలని లేకపోతే ఇక్కడ అవకాశాలు ఉండవని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఒక్కొక్కరికీ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.

తాజాగా మెగా డాటర్ నీహారిక కూడా ఈ విషయంపై స్పందించింది. 'కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. చాలా రంగాల్లో నేను ఇలాంటి విషయాల గురించి విన్నాను. అయితే అమ్మాయిలకు ఇష్టం లేకుండా ఏ మగాడు ఏమీ చేయలేరు. ఒకవేళ అలా చేస్తే అది కచ్చితంగా అత్యాచార నేరమే అవుతుంది. దానికి చట్టంలో ఎన్నో శిక్షలున్నాయి. ఒకవేళ అలా ఇబ్బంది పడ్డ వాళ్లు చట్టప్రకారం కోర్టుని, పోలీసులను ఆశచ్రయించాలి.

అంతా జరిగాకా వాళ్లు అలా చేశారు.. వీళ్లు ఇలా చేశారని చెప్పడం సరికాదు. మీరు ఓకే చెప్పకుండా ఎవరూ లాక్కొని వెళ్లిపోరు' అని వెల్లడించింది. ఇక కొందరు తమకు ఆ మార్గం తప్ప మరొకటి ఉండదని అంటే దాని గురించి మాట్లాడడం కష్టమని, తను వచ్చిన నేపధ్యం వేరు కాబట్టి వారి కోణంలో తను ఆలోచించలేనని తెలిపారు.