టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ తో కలిసి అదరిపోయే డాన్స్ స్టెప్స్ వేసింది మెగా డాటర్ నిహారికా కొణిదెల. ఇంతకీ ఆమె సంతోష్ తో కలిసి ఎందుకు డాన్స్ చేసిందంటే.. ?
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా అన్నీ మంచి శకునములే. లేడీ టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇక రీలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ఈమూవీ ప్రమోషన్స్ కు పదును పెట్టారు టీమ్. ప్రమోషన్స్ లో బిజీగా గడిపేస్తున్నారు సంతోష్ శోభన్ టీం. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో మెగా డాటర్ నిహారికా కొణిదెల కూడా భాగం అయింది. అన్నీ మంచి శకునములే మూవీ లోని మెరిసే మెరిసే సాంగ్‌కు సంతోష్ శోభన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది నిహారిక.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. తన భర్త చైతన్యతో ఆమె దూరంగా ఉంటున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దానికి తగ్గట్టుగానే.. వారి ఫోటోలు సోషల్ మీడియాలో డిలెట్ చేసుకున్నారు మెగా జంట. ఇదివరకట్లా.. నిహారికా, చైతన్యతో కలిసి ఉన్న వీడియోలు కూడా పెట్టడంలేదు. దాంతో వీరి విడాకులు కన్ ఫార్మ్ అయినట్టే అంటున్నారు. కాని ఈ విషయంలో వారిద్దరు అఫీషియల్ గా మాత్రం స్పందించలేదు.
అన్నీ మంచి శకునములే సినిమా విషయానకి వస్తేఇప్పటికే సంతోష్ శోభన్, మాళవికా నాయర్ పలు ఈవెంట్స్ కు హాజరవుతున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, అర్జుణ ఇతరపాత్రలు చేస్తున్నారు.
స్వప్నాదత్, ప్రియాంకా దత్ కలిసి స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పుడిప్పుడే హీరోగా నిలబడుతున్నాడు సంతోష్ శోభన్.. మంచిమంచి కథలు సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తున్నారు.
