త్వరలో తెలుగు  తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ.  ఇప్పటికే హీరోయిన్‌గా మారిన మెగా డాటర్ నీహారిక. వీరిద్దరూ కలిసి కారులో తమ ఫ్రెండ్స్ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్ లో సంచలనం అయ్యింది . ఈ మధ్యన పవన్ ఎవరో తెలియదని బాలయ్య  అనటం..దానికి కౌంటర్ గా  బాలయ్య ఎవరో తెలియదని మెగా బ్రదర్ నాగబాబు  అనటం జరిగింది.

దాంతో  బాలయ్య ఎవరో తెలియదని  నాగబాబు అనగానే .. కొంతమంది నెటిజన్లు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞతో నాగబాబు కుమార్తె నిహారిక ఉన్న ఫొటోలను తవ్వి తీసి  ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో  మోక్షజ్ఞతో ఉన్న ఫొటోలపై నిహారిక సమాధానం  ఇవ్వాల్సిన పరిస్దితి ఏర్పడింది.  తన తాజా సినిమా ‘సూర్యకాంతం’ ప్రమోషన్స్‌ కోసం ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నిహారికను.. మోక్షజ్ఞతో ఉన్న ఫొటోలపై ప్రశ్నించారు మీడియా వాళ్లు. దానికి నీహారిక పాజిటివ్ గా స్పందించింది. 

నీహారిక మాట్లాడుతూ..‘‘ అప్పట్లో అంటే నేను డిగ్రీ చదివేటప్పుడు కాలేజీలో మోక్షజ్ఞ నా జూనియర్. అప్పుడు అతను పరిచయం. మీరూ చూస్తున్న ఆ ఫొటోలు అప్పుడు దిగినవి. ఇప్పటివి కాదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు. ఇక మా నాన్న కామెంట్స్ ఆయన పర్శనల్. పెళ్లి అయ్యే వరకు నా జీవితం నా ఇష్టం. సినిమాలకు కూడా నేను ఒక్కదాన్నే వెళ్తా. పాప్‌కార్న్ షేర్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు.’’ అని రిప్లై ఇచ్చింది.

అయితే  మోక్షజ్ఞ, నిహారిక ఇద్దరూ చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని... వీరిద్దరూ చిన్నతనం నుంచే సినిమాల్లోకి రావాలని అనుకోవడం జరిగిందని సినిమా వాళ్లు అంటున్నారు. మంచి స్నేహితులుగా కొనసాగుతున్న వీరిద్దరూ  భవిష్యత్ లో హీరో, హీరోయిన్లుగా మారి ఒకే సినిమాలో నటిస్తారేమో అంటున్నారు.