హాట్ హీరోయిన్ తో హీరోగారి నైట్ అవుట్!

night shoot for nagachaitanya new film sailjareddy alludu
Highlights

ఆ హీరోయిన్ తో నైట్ మొత్తం జాగారమే

అక్కినేని నాగచైతన్య హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్ తో కలిసి రాత్రంతా జాగారం చేశాడట. రాత్రిపూట పడుకొని రెండు రోజులు అవుతుందట. మరో వారం రోజుల పాటు కూడా ఇలానే నైట్ అవుట్స్ చేయబోతున్నారని సమాచారం. వీరిద్దరితో పాటు నటుడు మురళీశర్మ కూడా జాగారం చేస్తున్నాడట. 

ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? చైతు, అను ఎమ్మాన్యుయల్ జంటగా దర్శకుడు మారుతి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రెండు రోజులుగా రాత్రిపూట ఈ సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మరో వారం రోజుల పటు ఈ నైట్ షెడ్యూల్ ను కంటిన్యూ చేయబోతున్నారు. 

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే 'సవ్యసాచి' సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాడట చైతు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader