ఫ్యాన్ క్లబ్ అనే నవల ఉంటుంది. అందులో కొందరు ఫ్యాన్స్ తాము ఆరాధించే హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారు. అయితే అంత అభిమానం ఉంటుందా..ఫ్యాన్స్ అలా ప్రక్క దారులు పడతారా అని అది చదువుతూంటే అనిపిస్తుంది. అయితే నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు వింటూంటే నిజమే అనిపిస్తుంది. తాజాగా నిధి అగర్వాల్ కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. చివరకు ఆమె బౌన్సర్స్ సాయింతో బయిటపడింది. అందుకు సంభందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. నిధి అగర్వాల్ తాజాగా  రాజమహేంద్రవరంలో అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న షూటింగ్ కోసం వెళ్లింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. దాంతో తమ ప్రక్కనే షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని కొంత మంది నిధి అగర్వాల్ చూసేందుకు అభిమానులు వచ్చేసారు. అయితే మొదట వారిని నిథి బాగానే మ్యానేజ్ చేసింది. విష్ చేసింది. హాయ్ చెప్పింది. అయితే ఆ ప్రవాహం ఆగేలా లేదు. దాంతో ఆమెకు ఇబ్బందులు తప్పలేదు. కొంతమంది ఉత్సాహం ఎక్కువై ఆమెతో సెల్ఫీలు దిగటానికి పోటీ పడ్డారు. మరికొంతమంది దొరికిందే సందు అని టచ్ చేయాలని చూసారు. 

నిధి అగర్వాల్‌ ఫొటోలు తీసుకునేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ‘నిధి మేడమ్‌’ అంటూ కేకలు వేశారు. దీంతో ఆమె.. అభిమానులకు నవ్వుతూ అభివాదం చేస్తూనే కొంచెం కంగారుగా కారు దగ్గరికి నడిచారు. అభిమానులు కూడా ఆమె వెంటే పరిగెత్తారు. ఆమె  దారికి అడ్డుపడిన కొంతమందరిని బౌన్సర్లు నిలువరించారు. అయితే, చీకటిపడినా కూడా అభిమానులు అక్కడే వేచి ఉండడంతో ఆమె వాహనం నుంచి బయటకు వచ్చి అందరికీ హాయ్‌ చెప్పారు.

ఆమె ఎక్కి వెళ్లాల్సిన వెహికల్ ని సైతం మూగేసారు. ఇదంతా గమనిస్తున్న బౌన్సర్స్ రంగంలోకి దూకారు. శృతిమించిన వాళ్లను ప్రక్కకు నెట్టారు. ఆమె సహానాన్ని పట్టించుకోకుండా మీద పడుతున్నవారినుంచి ఆమెను సేవ్ చేసి కారు ఎక్కించారు. అయితే ఆమెతో ఎలాగైనా సెల్ఫీ దిగాలని కొందరు అభిమానులు ఆమె వెనకే పడ్డారు. తనకు ఇంత క్రేజ్ ఉందని ఆనందించాలా..లేక ఈ వెర్రి చేష్టలకు విసుక్కోవాలా అనేది అర్దం కాని పరిస్దితి. 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాతో ఆయన కెమెరా ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.  అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. నరేష్, సత్య, అర్చన సౌందర్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.