అక్కినేని వారసులతో నటించి టాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న నిధి అగర్వాల్ ఇప్పుడు మరో అఫర్ అందుకుంది. సవ్యసాచి లో నాగ చైతన్యతో నటిస్తున్న సమయంలోనే తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలు బ్యూటీకి సక్సెస్ ఇవ్వలేదు. 

దీంతో ఇప్పుడు సక్సెస్ లేని యూనిట్ తో మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకోనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటిస్తున్న డిఫరెంట్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఛార్మి కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లో మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడంతో సినిమా నటి నటులను కూడా ఫైనల్ చేస్తున్నారు. 

మొత్తానికి హీరోయిన్ గా మిస్టర్ మజ్ను బ్యూటీ సెట్టయ్యింది. ఇక సినిమాలో రామ్ అచ్చమైన హైదరాబాదీగా గా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.  పూరి బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.