బాహుబలి తెరకెక్కకముందు దర్శకుడు రాజమౌళి చాలా మంది స్టార్ నటీనటుల వెంట తిరిగి కొన్ని పాత్రల కోసం చాలానే బ్రతిమాలాడు. అయితే సినిమా రిలీజ్ అనంతరం అయ్యో మంచి అవకాశం మిస్సయ్యామని కొందరు బయటకి చెప్పుకుంటే మరికొందరు లోలోపల అప్సెట్ అయ్యారు. 

ఆ సంగతి పక్కనపెడితే.. నేటితరం యువ నటీనటులు బాహుబలి 3 కోసం ఎదురుచూస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా నిధి అగర్వాల్ కూడా అదే కామెంట్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆ కామెంట్ పై ట్రోల్ చేస్తూ.. నీ కోసం బాహుబలి 3 తియ్యాలా అని కామెంట్ చేస్తున్నారు. బాహుబలి రెండు బాగాలకే ఎండ్ కార్డ్ పెట్టేసిన జక్కన్న మళ్ళీ ఆ కథకు జోలికి వెళ్లనని  కుండ బద్దలు కొట్టాడు.

దీంతో మరో పార్ట్ ఉండదని జనాలకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయినప్పటికీ కావాలని కొందరు బాహుబలి పేరెత్తి జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ బాహుబలి 3లో నటించాలని ఉందని ఎవరికీ వారే స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. ఈ కామెంట్ ఇప్పటికే ఆడియెన్స్ కి బోర్ కొట్టేసింది. 

బాహుబలిని మరచిపోయిన జక్కన్న RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. కావాలంటే ఆ సినిమాలో నటించాలని ఉందని చెబితే ఆడియెన్స్ సపోర్ట్ తో జక్కన్న  ఆలోచించే అవకాశం ఉంటుంది. అంతేగాని అంతా అయిపోయిన కథ గురించి కామెంట్ చేస్తే లాభం ఏముంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.