టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమా `హరిహరవీరమల్లు` చిత్ర యూనిట్‌ గిఫ్ట్ ఇచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్‌ విడుదల చేసింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న `హరిహరవీరమల్లు` చిత్రంలో క్రేజీ బ్యూటీ నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(ఆగస్ట్17) మంగళవారం ఈ అమ్మడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా `హరిహరవీరమల్లు` చిత్రంలోని నిధి పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ఇందులో నిధి అగర్వాల్‌ `పంచమి` అనే పాత్రలో కనిపించబోతుంది. ఆమె చీరకట్టులో సాంప్రదాయ నృత్య కారిణిగా డాన్స్ మూవ్‌మెంట్‌తో కనిపించడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

నిధి తన అభిమానులకు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పింది. ప్రస్తుతం ఈ పిక్‌ వైరల్‌ అవుతుంది. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మేఘసూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం పవన్‌` భీమ్లా నాయక్‌` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకుని తిరిగి ఈ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది. 

Scroll to load tweet…

ఇక నిధి అగర్వాల్‌ `ఇస్మార్ట్ శంకర్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. మరోవైపు తన అందాల ఆరబోతతో, వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది. నిధి ప్రస్తుతం `హీరో` చిత్రంతోపాటు ఓ తమిళ సినిమాలో నటిస్తుంది.