సెల్వ రాఘవన్ - సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన NGK ఫైనల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ట్రైలర్ తో అన్ని వర్గాల ఆడియెన్స్ ఎట్రాక్ చేసిన ఈ సినిమా యూఎస్ లో కూడా భారీగా రిలీజ్ కాబోతోంది. కొద్దిసేపటి క్రితం ప్రవాసులు ప్రీమియర్స్ ను చూశారు. 

సినిమా విషయానికి వస్తే.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు సెల్వ ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక మంచి సేందేశాన్ని ఇచ్చాడని చెప్పవచ్చు. దేశభక్తికి సంబందించిన సీన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తాయి, నంద గోపాల్ పాత్రలో సూర్య నటించిన విధానం బావుంది. అలాగే సెకండ్ హాఫ్ లో సూర్య నటన హైలెట్ చెప్పవచ్చు. 

మంచి  జాబ్ వదిలేసి రైతుగా సెటిల్ అవ్వాలని సూర్య నందగోపాల్ పాత్రలో పరిచయమయ్యే విధానం కూల్ గా ఉంది. నంద గోపాల్ మరియు అతని స్నేహితులు పెస్టిసైడ్(క్రిమి సంహారిణి)మాఫియా నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న అనంతరం కథ ఊహించని విధంగా పాలిటిక్స్ జానర్ లోకి మారుతుంది. 

సూర్య ఒక కార్యకర్తగా పార్టీలో కొనసాగుతూ ఎదుర్కొన్న పరిణామాలు అలాగే చివరలో ప్రస్తుత మనుషుల  గురించి సూర్య చెప్పే స్పీచ్ హైలెట్. సూర్యకు భార్యగా సాయి పల్లవి సింపుల్ నటనతో ఆకట్టుకుంటుంది.. ఇక మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా ఒక లేడి పొలిటీషియన్ గా కీలక పాత్రలో మెప్పించింది.