హీరో సూర్య, దర్శకుడు సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'NGK'. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ టాక్ ని బట్టి తెలుసుకుందాం..

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుందట. ఓ సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ఉన్న సిస్టంని మార్చాలనుకునే పాయింట్ నేటి యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని, సినిమాలో సూర్య నటన హైలైట్ గా నిలిచిందని అంటున్నారు.

తన కెరీర్ లోనే సూర్య బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని, ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే సీన్, ఆ సన్నివేశాలలో అందరి నటన పీక్స్ లో ఉందని టాక్. సెకండ్ హాఫ్ లో స్టంట్ సీక్వెన్స్ బాగున్నాయని అంటున్నారు. పొలిటికల్ కన్సల్టంట్ గా రకుల్ ఇంప్రెస్ చేస్తుందట. ఒకట్రెండు పాటలు కూడా బాగున్నాయని, ఇది సూర్య షో అని చెబుతున్నారు.