తమిళ స్టార్ హీరో సూర్యకి కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆయన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 'NGK' సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయనే అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. '

'అరేయ్.. అది శ్మశానం రా.. లోపలికి వెళ్లినవాడు శవంగానే బయటికి వస్తాడు'' అంటూ రాజకీయాల గురించి సూర్యతో పెద్దావిడ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాకి సూర్య స్వయంగా  డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు.