టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో యంగ్ హీరో రోషన్ (Roshan) ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ (Roshan) గతేడాది ‘పెళ్లి సందడి’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రం గతేడాది అక్టోబర్ 15న రిలీజ్ అయ్యింది. రూ.8 కోట్ల అంచనా బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ తో ఒకే అనిపించుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు వసూల్ చేసి నిర్మాతను ఖుషీ చేసింది. హీరోయిన్ శ్రీలీలా, రోషన్ కెమి స్ట్రీ ఆడియెన్స్ ను ఎంతగానో మెప్పించాయి అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాతో రోషన్ కు కొంత మైలేజ్ రాగా.. హీరోయిన్ శ్రీలీలాకు మాత్రం మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. 

డైరెక్టర్ గౌరీ రోనంకి తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో రోషన్ కొంత జోష్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ యంగ్ మరో పెద్ద బ్యానర్ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies), స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యాడు. వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 9తో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. చిత్రంలో ప్రధాన నటుడిగా రోషన్ ను ఎంపిక చేసుకుంది. రోషన్ 23వ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (Pradeep Advaitam) దర్శకత్వం వహిస్తున్నారు.

Scroll to load tweet…

పోస్టర్ లో రోషన్ వెనుదిరిన స్టిల్లో.. ఓ క్యారీ బ్యాగ్ ను మోస్తూ కనిపిస్తుంటాడు. బ్యాక్ డ్రాప్ లో ఓ విలేజ్ వాతావరణాన్ని చూడొచ్చు. ఇన్ షర్ట్ వేసుకున్న రోషన్ ఓ క్లాస్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు. చేయలేదు. బహుశా ఈనెల చివరల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే ఈ చిత్రం యూనిట్ ఉన్నట్టుు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’ (ProjectK)ను కూడా ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు.