మిల్కీ బ్యూటీ తమన్నా, సందీప్‌ కిషన్‌లు కలిసి నటించిన చిత్రం ‘నెక్ట్స్‌ ఏంటి?’. ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైంది.  అయితే రిలీజ్ కు ముందు క్రేజ్ ఏమీ పని చేయలేదు.  సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చేసుకుంది.  వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న సందీప్ కిషన్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ పంక్షన్ లో సినిమాని యూత్ కు టార్గెట్ చేస్తున్నట్లు క్లియర్ చెప్తూ..సంచలాత్మక కామెంట్స్ సైతం చేసాడు. అయితే అవేమీ ఓపినింగ్స్ కూడా తెచ్చి పెట్టలేకపోయాయి. 

తమన్నా గ్లామర్ కూడా కలిసి రాలేదు. మరి లోపం ఎక్కడుంది. ఓపినింగ్స్ వచ్చాక ..సినిమా ఫ్లాఫ్ అయ్యిందంటే ఆ లెక్క వేరు. కానీ అసలు జనాలను ఎట్రాక్ట్ చేయటంలోనే ఫెయిలవటం టీమ్ కు మింగుడు పడని విషయం.

ఈ నేపధ్యంలో సందీప్ కిషన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు.  సినిమా డిజాస్టర్ కావటానికి కారణం ...ప్రమోషన్ లేకపోవటమే అని తేల్చి చెప్పాడు. సినిమా ఈ జనరేషన్ కు తగ్గ ఆలోచనలతో రూపొందిందని, కంటెంట్ ని నమ్మి చేసామని అయినా ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లలేకపోయామని వాపోయారు.

అయితే సినిమా చూసిన వాళ్లు సూపర్ బోరింగ్ గా ఉందని, సినిమాలో నెక్ట్స్ ఏంటనే ఆసక్తిని లేకుండా పోయిందని, పేజీలకు పేజీలకు డైలాగులు చెప్తూ కాలక్షేపం చేసారని అదే సినిమాని దెబ్బ కొట్టిందని అంటున్నారు. రివ్యూలు నెగిటివ్ గా రావటం కూడా సినిమాని భారీగా దెబ్బ తీయటానికి కారణం అయ్యింది..ఏమంటారు. 

బాలీవుడ్‌లో ‘ఫనా’, ‘హమ్‌ తుమ్‌’లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కునాల్‌ కోహ్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అతనికి తెలుగులో ఇదే మొదటి చిత్రం. రైనా జోషి, అక్షయ్‌ పురిలు నిర్మాతలు.  ఈ చిత్రానికి కెమెరా: మనీష్‌ చంద్ర భట్, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌ : సతీష్‌ సాల్వి, సంజన చోప్రా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: షాజహాన్, శివప్రసాద్‌ గుడిమిట్ల, రిలీజ్‌: శ్రీ కృష్ణ క్రియేషన్స్‌.