"అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు..  దాని గురించేనా లైక్ 24X7?" ఈ ఒక్క డైలాగ్ తో తమన్నా షాక్ ఇచ్చింది.  దానికి నవదీప్ కూడా "100%" అని అని క్లారిటీ ఇవ్వడంతో టీజర్ కాస్త ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ఓపెన్ గానే ఉందని చెప్పవచ్చు. తమన్నా - సందీప్ కిషన్ జంటగా నటించిన చిత్రం నెక్స్ట్ ఏంటి?

సినిమా టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఒక్కసారిగా అందరిని ఆకర్షించింది. సందీప్ కిషన్.. 'లైఫ్ చాలా చిన్నదని.. అమ్మాయిల విషయంలో అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని"దట్ వన్ ఛాన్స్.. గ్రాబ్ ఇట్" అంటూ స్నేహితులకు ఒక ఫిలాసఫీ టచ్ ఇవ్వడం చూస్తుంటే అతను ఒక ప్లే బాయ్ లా కనిపిస్తున్నాడు. 

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి టీజర్ ను బాగానే రిలీజ్ చేశారు గాని ఇలాంటి తరహాలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. స్క్రీన్ ప్లే తో దర్శకుడు కునాల్ కోహ్లీ మ్యాజిక్ ఏమైనా చేసి ఉంటే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే రానున్న ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.