మిల్కీ బ్యూటీ తమన్నా, సందీప్ కిషన్ తొలిసారి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నెక్స్ట్ ఏంటి'. మరో హీరో నవదీప్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ తో యూత్ లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.

తమన్నా ట్రైలర్ లో పలికిన డైలాగులు బోల్డ్ గా ఉండడం, హీరో సందీప్ కిషన్ లవ్, సెక్స్ ఈ రెండు అంశాలపై ఆసక్తి ఉన్న వారికి మా సినిమా నచ్చుతుందనిచెప్పడం వంటి విషయాలు సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేశాయి.

ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో 'ఫనా', 'హమ్ తుమ్' వంటి ప్రేమకథా చిత్రాలను రూపొందించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ సినిమాను తెరకెక్కించడంతో అన్ని ఏరియాల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

సచిన్ జోషి భార్య రైనా జోషి, అక్షయ్ పూరిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. లియోన్ జోన్స్ సంగీతం అందించిన ఈ సినిమా రివ్యూల కోసం సోషల్ మీడియాలో  అభిమానుల వెతుకులాట మొదలైంది.