జనసమర్ధం అధికంగా ఉండే కేబీఆర్ పార్క్ లో నటి షాలు చౌరాసియా పై దాడి జరగడం సంచలనం మారింది. ఈ దాడి దొంగల పనే అని మొదట పోలీసులు భావించారు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి.  


ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నటి షాలు చౌరాసియా కేబీఆర్ పార్క్(KBR park) కి జాగింగ్ కి వెళ్లడం జరిగింది. కేబీఆర్ పార్క్ ఔటర్ ట్రాక్ పై ఆమె జాగింగ్ చేస్తున్న సమయంలో ఓ దుండగుడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆమె ముఖంపై గుద్దడంతో పాటు, రాయితో తలపై మోదే ప్రయత్నం చేశాడు. అలాగే ఆమె దగ్గర ఉన్న మొబైల్ లాక్కొని పారిపోవడం జరిగింది. 


ఈ దాడి దొంగల పనే అని మొదట పోలీసులు భావించారు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి.ఆ రోజు ఏమి జరిగిందో షాలు వివరంగా పోలీసులకు తెలియజేశారు. ఓ వ్యక్తి అమాంతంగా తనపై దాడికి తెగబడ్డాడు. తనను పక్కనే ఉన్న పొదల్లోకి ఈడ్చుకెళ్లాడు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు మెడ, పెదవులపై గాయాలు చేశాడు. దాడి నుండి బయట పడడానికి నేను ప్రతిఘటించడం జరిగింది. ఈ క్రమంలో నా ముఖంపై గుద్దాడు.. అని షాలు తెలియజేశారు. 


దాడి అనంతరం ఆమె మొబైల్ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. షాలు (Shalu chourasiya) పై దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. అయితే ఆ ప్రాంతాన్ని కవర్ చేస్తున్న సీసీ కెమెరా పని చేయకపోవడంతో దాడి దృశ్యం రికార్డు కాలేదు. మరో కెమెరాలో మాత్రం షాలు భయంతో పరుగెడుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. 

Also read నటి షాలూ చౌరాసియాపై దాడి కేసులో విస్తుపోయే నిజాలు, ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా!
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న మిగతా సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. దాడి చేసిందని పాత నేరస్తులని మొదట పోలీసులు భావించారు. అయితే ఇది ఓ సైకో పని అని వాళ్ళ దార్యప్తులో తేలింది. నటి చౌరాసియా కోసం ప్రత్యేకంగా ఆ సైకో(Psycho) వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి జల్లెడ పడుతున్నారు. 

Also read వివాదాల్లో `జై భీమ్‌`.. సూర్యని కొడితే లక్ష రూపాయల ఆఫర్‌.. దుమారం..

స్వల్ప గాయాలపాలైన షాలు చౌరాసియా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేకున్నా, అనుకోని ఈ సంఘటనతో ఆమె షాక్ గురైనట్లు సమాచారం. కేబీఆర్ పార్క్ లో సినీ ప్రముఖులతో హై ప్రొఫైల్ పీపుల్ జాగింగ్, వాకింగ్ కి వస్తూ ఉంటారు. అలాంటి కట్టుదిట్టమైన ప్రాంతంలో ఇలాంటి దాడి జరగడం సంచలనంగా మారింది.