సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలయ్య అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్బీకే107’ నుంచి మాస్ పోస్టర్ ను వదిలారు మేకర్స్. బాలయ్య మాస్ లుక్ దుమ్మురేపుతోంది.
`అఖండ` లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య హీరోగా వస్తోన్న చిత్రం ‘ఎన్బీకే107’. ఈ చిత్రాన్ని `క్రాక్` హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ కాంబినేషనల్ వస్తున్న చిత్రం NBK107 కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, లీకైన లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు మేకర్స్ అదిరిపోయే ట్రీట్ అందించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ.. ఎన్బీకే107 నుంచి మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ లో బాలయ్య ఉగ్రరూపం దాల్చాడు. చేతిలో ఖడ్గంతో రౌడీల తలలు నరికేంత కోపంతో రగిలిపోతున్నాడు. ఈమూవీలో ఇదే భారీ యాక్షన్ సీన్ గా కనిపిస్తోంది. పోస్టర్ లో బాలయ్య చాలా ఎనర్జిటిక్ గా, మాస్ పవర్ ను చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
`NBK 107` వర్క్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో మాస్ పోస్టర్ రిలీజ్ కావడం ఫ్యాన్స్ లో జోష్ పెంచుతోంది. త్వరలో ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
