బాలయ్య హంటింగ్ షురూ అయ్యింది. మొన్నటి వరకు ‘అఖండ’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నందమూరి నటసింహం.. తన అప్ కమింగ్ ఫిల్మ్ ఎన్ బీకే 107 (NBK107)తో మళ్లీ గర్జించనున్నాడు. తాజాగా ఆ మూవీ నుంచి సాండల్ వుడ్ స్టార్ దునియా విజయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ అయ్యింది.

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇటీవల `అఖండ` (Akhanda) తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఆయన అప్ కమింగ్ ఫిల్మ్ గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ‘ఎన్బీకే 107’పై ఫోకస్ పెట్టారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ‘టైటిల్’పైనా, హీరోయిన్ ఎంపికైన సోషల్ మీడియా తెగ చర్చ నడిచింది. కాగా ఫిబ్రవరి 21న మేకర్స్ ఎన్బీకే 107 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా బాలయ్య బాబు విలన్ ను ఇంట్రడ్యూస్ చేశారు.

ఈ మూవీకి సంబంధించిన బాలయ్య బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే చాలా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. పోనుపోను బాలయ్య మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఈ మూవీలో బాలక్రిష్ణ మరోసారి విశ్వరూపం చూపించనున్నట్టు అర్థమైపోతోంది. కాగా తాజాగా ఎన్ బీకే 107 నుంచి బాలయ్య బాబు విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కన్నడ స్టార్ దునియా విజయ్ (Duniya Vijay) ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దునియా విజయ మూవీలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. మాస్ లుక్ లో ఉన్న ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 

పోస్టర్ లో విజయ్ లుక్ చాలా రఫ్ గా ఉంది. చెవిపోగు పెట్టుకొని, స్పైక్ హెయిర్ తో ఆకట్టుకుంటున్నాడు. సిగరేట్ వెలిగిస్తూ ఆడియెన్స్ కండ్లలోకి సూటిగా చూస్తున్నాడు. మొత్తంగా మీద దునియా విజయ్ తెలుగు ఆడియెన్స్ ను తన నటనతో భయపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రానికి గోపీచంద్ (Gopichand Malineni)మాలినేని దర్శకత్వం వహిస్తుండగా.. శ్రుతి హాసన్ (Shruti Haasan) బాలయ్య బాబుకు జోడీగా ఆడిపాడనుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నారు. 

View post on Instagram

 `క్రాక్‌` (Krack) తర్వాత గోపీచంద్‌ మాలినేనితో బాలకృష్ణ చేస్తున్న చిత్రమిది. `క్రాక్‌` చిత్రం చూసిన బాలయ్య దర్శకుడు గోపీచంద్‌ మలినేని అభినందించారు. తనతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సినిమాని అధికారికంగా ప్రకటించారు. కానీ టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో అప్డేట్ రానుంది. దునియా విజయ్ కన్నడ స్టార్ గా ప్రసిద్ధి చెందాడు. యాక్టర్ గా, డైరెక్టర్ గా, ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ రైటర్ గా విజయ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలయ్య చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు.