ఎన్టీఆర్ సెల్ఫీ @ అరవింద సమేత సెట్స్ !

new photo from the sets of ntr's aravinda sametha movie
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమాను 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే త్రివిక్రమ్ తన ప్రతి సినిమాకు రిపీట్ చేసే నటుల్లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఒకడు.

ఈ సినిమాలో కూడా ఆయనకు మంచి పాత్ర దక్కిందని సమాచారం. ఇటీవల షూటింగ్ లో పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి.. దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ లతో కలిసి ఓ ఫోటో తీసుకున్నాడు. ఎన్టీఆర్ సెల్ఫీ తీసిన ఈ ఫోటోను సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి.

''మధురం మధురం ఈ సమయం'' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటోని మీరు ఒకసారి చూసేయండి!

 

loader